Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచర్లలో ఘనంగా బోనాల సంబరాలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:10 AM నాగర్ కర్నూల్General
వెన్నచర్లలో ఘనంగా బోనాల సంబరాలు - Udayam
పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో బోనాల పండుగను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. అనంతరం పోతురాజుల వేషధారణలు, డీజే సౌండ్‌లతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు బోనాలు సమర్పించి గ్రామ సుఖసంతోషాలు, పాడిపంటల అభివృద్ధి కోసం ప్రార్థించారు.

Comments

G
Loading comments...