వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో అర్ధరాత్రి చిరుత కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. లింగయ్య డొంక వద్ద కేకలు వేయడంతో చిరుత గ్రామం చివరి వీధి వైపు వెళ్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
అటవీ అధికారులు పాదముద్రలు గుర్తించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, చిరుత కనిపిస్తే దగ్గరకు వెళ్లకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

