వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలోని బొమ్మిక రహదారిపై శుక్రవారం ఏనుగుల గుంపు సంచరించడంతో కలకలం రేగింది. గుంపుగా వచ్చిన ఏనుగులు రహదారిని దాటుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు.
తరచూ ఏనుగులు జనావాసాలు, రహదారుల వైపు వస్తున్నందున వాటికి దగ్గరగా వెళ్లకుండా సురక్షిత దూరం పాటించాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

