Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు కోసం నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన బొలెరో

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 09, 2026 8:50 AM హైదరాబాద్General
బస్సు కోసం నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన బొలెరో - Udayam
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు హైవేపై రోడ్డుపక్కన బస్సు కోసం వేచి చూస్తున్న వారిపైకి ఓ బొలెరో వాహనం అతివేగంగా దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...