Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగత జలపాతం వెలవెల

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 28, 2026 3:35 PM ములుగు General
బొగత జలపాతం వెలవెల - Udayam
​తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా బొగత జలపాతం ఆదివారం పర్యాటకులు లేక వెలవెలబోయింది. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో, సెలవు రోజైనా కేవలం పదుల సంఖ్యలోనే సందర్శకులు వచ్చారు. వచ్చిన కొద్దిమంది పర్యాటకులు అక్కడ తక్కువ నీటిలోనే ఈత కొడుతూ గడిపారు. ​భారీ వర్షాలు కురిసి, జలపాతంలో నీటి ఉధృతి పెరిగితేనే పర్యాటకుల తాకిడి మళ్లీ పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. వర్షాలు పడితేనే ఈ ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...