Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పనుల్లో నాణ్యత పాటించాలి

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:19 PM విజయనగరంGeneral
బొబ్బిలి పనుల్లో నాణ్యత పాటించాలి - Udayam
బొబ్బిలి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కమిషనర్‌ లాలం రామలక్ష్మి ఆదేశించారు. బుధవారం బైపాస్‌ రోడ్డు పనులను పరిశీలించిన ఆమె.. పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. కల్వర్టు పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన కమిషనర్‌.. అనంతరం పారిశుద్ధ్య పనులను కూడా పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...