Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారంలో పత్తి రైతులకు కూలీల కొరత

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:59 AM వికారాబాద్General
బంట్వారంలో పత్తి రైతులకు కూలీల కొరత - Udayam
బంట్వారం మండలంలో పత్తి రైతులు కూలీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి తీతకు కూలీలు దొరకకపోవడంతో పలు చోట్ల సేకరణ పనులు నిలిచిపోతున్నాయి. చేతికొచ్చిన పంటను సకాలంలో తీయలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో కూలికి రూ.350 నుంచి రూ.400 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. కూలీల కొరతతో పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...