వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నుండి స్పెయిన్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక ప్రయాణికుడి బ్లూటూత్ పరికరానికి 'బాంబ్' అని పేరు ఉండటంతో సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. ఆ పరికరం ఆపాలని కోరినా ఫలితం లేకపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు.
నెవార్క్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. 190 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఆ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న పొరపాటు వందల మందిని కంగారు పెట్టించింది.
Comments
Loading comments...

