Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛను కోసం చూపులేని బాధితుడి పోరాటం!

అశ్విని దేవి Jun 30, 2026 5:29 AM ఖమ్మం 0 viewsabout 2 hours ago
పింఛను కోసం చూపులేని బాధితుడి పోరాటం! - Udayam Digital
కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన గాలిబు ఉపేందర్‌రావు ఎనిమిదేళ్లుగా దృష్టిని కోల్పోయారు. వైకల్య ధ్రువీకరణ ఉన్నా, ఏళ్ల తరబడి దరఖాస్తులు చేసుకుంటున్నా అధికారులు పింఛను మంజూరు చేయకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. భర్త చూపు లేక, భార్య నాగమణి కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. పింఛను కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, కనీస సాయం కోసం వారు అధికారులను ఆశ్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...