వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో విద్యుత్ కోతలకు నిరసనగా భాజపా నేతలు రైతులతో కలిసి మైలగడ్డ స్టేజి వద్ద రాయచూర్ రహదారిపై ఆందోళనకు దిగారు. నిరంతరం విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గంటపాటు సాగిన ఈ రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ డీఈ రవి ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

