వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు.
ఈ ఆరోపణలను బీజేపీ నేత షానవాజ్ హుసేన్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, కాంగ్రెస్ నిరాధారమైన విమర్శలతో కాలక్షేపం చేస్తోందని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
Comments
Loading comments...

