వార్తలకు తిరిగి వెళ్లండి

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్ పర్యాటకులకు భారత్ టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించింది. పర్యాటకులు జూన్ 28 నుంచి వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది ప్రకటించారు. ప్రస్తుతానికి 5 వీసా అప్లికేషన్ కేంద్రాల (IVAC) ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలు, షేక్ హసీనా పలాయనంతో వీసాల జారీ నిలిచిపోయింది. అయితే, ఇటీవల బంగ్లాలో బీఎన్‌పీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు తిరిగి గాడిన పడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

