వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలసాంగ్వీ గ్రామంలో ఆదివాసీలు జగెయ్ మాతరి పండుగను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య అనంతరం వెదురు కర్రలు, మొదగ ఆకులు, నైవేద్యంతో గ్రామం నుంచి పుల్లిమేర వరకు ఊరేగింపుగా వెళ్లారు.
‘జగెయ్ మాతరి’ నినాదాలతో శివాపెన్ వద్ద పూజలు నిర్వహించి, అనంతరం సామూహిక భోజనాలు చేశారు. పటేల్ భీంరావ్, దేవారి లక్ష్మణ్, మహాజన్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

