Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోటలో అత్యధికంగా పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 11:22 AM అన్నమయ్యGeneral
బి.కొత్తకోటలో అత్యధికంగా పోలింగ్ - Udayam
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఆరు మండలాల్లో బి.కొత్తకోటలో అత్యధికంగా 75.09 శాతం పోలింగ్ నమోదైంది. ములకలచెరువులో 63.03, పెద్దతిప్పసముద్రంలో 72.43, కురబలకోటలో 71.77 శాతం ఓటింగ్ జరిగింది. తంబళ్లపల్లెలో 69.3, పెద్దమండ్యంలో 67.43 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మదనపల్లెలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

Comments

G
Loading comments...