వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలులోని గోలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నివసించే వల్లూరు గంగాభవాని ఇంట్లో 162 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇటీవల భర్త మరణించడంతో ఇంటికి వచ్చి ఉంటున్న బంధువుల కోసం సీసీ కెమెరాలు నిలిపివేసిన సమయంలో, మారుతాళాలతో బీరువా తెరిచి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

