Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల రోడ్డుపై బైక్ ప్రమాదం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 10:44 AM జోగులాంబ గద్వాల్ General
జూరాల రోడ్డుపై బైక్ ప్రమాదం - Udayam
జూరాల ప్రాజెక్టు రోడ్డుపై గత రాత్రి జరిగిన బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజాపూర్‌ మండలం మల్లేపల్లికి చెందిన శివకుమార్‌ (24), పీర్లగూడెంకు చెందిన గణేష్‌ (23) బైక్‌ అదుపుతప్పడంతో గాయపడ్డారు. మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనలో మరో యువకుడు శ్రీకాంత్‌కు గాయాలయ్యాయని ధరూర్‌ పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...