Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ గుట్ట ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 14, 2026 9:42 PM సంగారెడ్డిGeneral
బీరంగూడ గుట్ట ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - Udayam
బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మట్టి గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని గణనాథుడి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Comments

G
Loading comments...