వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడి ప్రజల్లో చైతన్యం నింపిన ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
Comments
Loading comments...

