Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఆఫీస్‌పై దాడికి బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలి: బండి సంజయ్

Follow Udayam on Google
sudheer Aug 31, 2026 6:09 PM కరీంనగర్General
బీజేపీ ఆఫీస్‌పై దాడికి బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలి: బండి సంజయ్ - Udayam
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి, గేటుకు నల్ల రంగు పూసిన ఘటనపై కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. పట్టపగలు దాడి జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నిస్తూ, పోలీసుల తీరుపై వివరణ కోరారు. బాధ్యులను అరెస్టు చేయాలన్నారు.

Comments

G
Loading comments...