వార్తలకు తిరిగి వెళ్లండి
కటాఫ్ డేట్ తొలగించి అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు.
దర్పల్లి శనివారం అంగడి బజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలికి పెన్షన్ అందించాలని కోరారు.
Comments
Loading comments...

