వార్తలకు తిరిగి వెళ్లండి

జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన బీహార్‌లోని బీజేపీ కంచుకోట బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన స్వయంగా పోటీ చేయనున్నారు.
ఈ నెల 30న జరగబోయే ఈ పోలింగ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రిఫరెండం లాంటిదని పీకే పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలుపు ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తన పార్టీని బలోపేతం చేయాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు.
Comments
Loading comments...

