Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డక్కిలి అడవుల్లో పెద్దపులి జాడ?

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 2:41 PM తిరుపతిGeneral
డక్కిలి అడవుల్లో పెద్దపులి జాడ? - Udayam
డక్కిలి మండలం వెంబులూరు అటవీ బీట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ట్రాక్‌ కెమెరాలో పెద్దపులి సంచరించినట్లు భావిస్తున్న చిత్రం నమోదైనట్లు సమాచారం. పులుల గణన సర్వేలో భాగంగా అటవీశాఖ ఈ కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరా ఫుటేజీని పరిశీలన కోసం శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రానికి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే పెద్దపులి సంచారంపై తమకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని స్థానిక అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...