వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో కారులో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, ఒక బైక్ పూర్తిగా దహనమయ్యాయి. పేలుడు ధాటికి స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. జనావాసాల మధ్య ఇలాంటి పనులపై ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

