Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి మ్యాక్స్ సొసైటీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన MLA మహిపాల్ రెడ్డి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 23, 2026 8:09 PM సంగారెడ్డిGeneral
బి మ్యాక్స్ సొసైటీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన MLA మహిపాల్ రెడ్డి - Udayam
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఉస్మాన్‌నగర్‌ బి మ్యాక్‌ సొసైటీలో చిట్టి ఉమేశ్వర్‌ సొంత నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు MLA మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సొంత నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. కౌన్సిలర్‌గా ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మిస్తున్నట్లు చిట్టి ఉమేశ్వర్‌ తెలిపారు. నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...