Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్‌

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 7:13 PM జయ శంకర్ భూపాలపల్లి General
 భూపాలపల్లిలో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్‌ - Udayam
వ్యవసాయ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ట్రాక్టర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. మంజూరు నగర్‌, బాంబులగడ్డ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మూడు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఏఎంవీఐలు ఫహిమ సుల్తానా, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...