వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోటకు చెందిన గార సంతోష్ అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం స్మశానవాటికలో భార్య సంతోషి భర్త చితికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. పుట్టుకతో పోలియో బాధితురాలైన సంతోషికి తోటి మహిళలు సహకరించారు.
భర్తకు భార్యే తలకొరివి పెట్టిన దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతుడు సంతోష్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...

