Udayam Digital
Menu

భర్త మరణంతో గంటల్లోనే భార్య మృతి

Shruthi Nov 21, 2026 12:53 PM వరంగల్General
భర్త మరణంతో గంటల్లోనే భార్య మృతి - Udayam Digital
భర్త మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య ప్రాణాలు విడిచిన విషాద ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ పరిధిలోని చాగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. వడ్లకొండ లోకనాథం (84) శుక్రవారం రాత్రి మృతి చెందగా, ఆయన భార్య రామక్క (75) తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భర్త మృతితో కలత చెందిన ఆమె శనివారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో కన్నుమూశారు. రామక్క కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Comments

G
Loading comments...