వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.
ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా జానపద కళారూపాలతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...