వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారని, నిమజ్జన సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు.
సోమవారం రాత్రి కట్టమంచి చెరువు వద్ద గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. నగరపాలక సంస్థ, పోలీసులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

