వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది మంగళవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర JAC పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, 100% గ్రాస్ శాలరీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

