Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మ మహేశ్వర ఆలయంలో భస్మాభిషేకం

Follow Udayam on Google
రవళి దేవి Aug 12, 2026 6:20 PM మార్కాపురంGeneral
నిర్మ మహేశ్వర ఆలయంలో భస్మాభిషేకం - Udayam
అమావాస్య సందర్భంగా పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో భస్మాభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. అమ్మవారిని, నందీశ్వరుడిని, ధ్వజస్తంభాన్ని కూరగాయలతో అలంకరించారు. పార్వతీదేవి ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఛైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

Comments

G
Loading comments...