వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు మండలం పెంచికలపాడులో పెద్దయ్య స్వామి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. పీర్ల పండుగ సందర్భంగా పెంచికలపాడు నుంచి నాగలాపురం వరకు సాగిన ఈ ఊరేగింపులో బూడిదిపాడు పీర్లు కూడా పాల్గొన్నాయి.
ఈ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, చిన్నారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

