వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణంలోని లాడ్జీలు, బస్టాండ్లలో పోలీసులు గురువారం తెల్లవారుజామున ఆకస్మిక సోదాలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు, శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు 62 లాడ్జీల్లో డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.
ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

