వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కుడి కాలి కండరంలో గాయం కారణంగా పేసర్ లాకీ ఫెర్గూసన్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. కోలుకోవడానికి ఫెర్గూసన్‌కు మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది.
మరో పేసర్ మాట్ హెన్రీ కూడా కుడి తొడ కండరంలో గాయంతో ఒకటి నుంచి రెండు వారాలు విశ్రాంతి తీసుకోనున్నాడు.
Comments
Loading comments...

