వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 343/4తో పటిష్ఠంగా కనిపించిన జట్టు, చివరి ఆరు వికెట్లను 37 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. హిమతేజ (81), ప్రజ్ఞయ్ రెడ్డి (65) రాణించారు.
పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 57 పరుగులు సాధించింది.
Comments
Loading comments...

