Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణవి స్పిన్‌ మాయాజాలం.. జింబాబ్వేపై భారత్‌ క్లీన్‌స్వీప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:43 AM జాతీయంక్రీడలు
వైష్ణవి స్పిన్‌ మాయాజాలం.. జింబాబ్వేపై భారత్‌ క్లీన్‌స్వీప్‌ - Udayam
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో వన్డేలో స్పిన్నర్‌ వైష్ణవి శర్మ (5/39) ఐదు వికెట్లతో చెలరేగడంతో జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. క్రాంతి గౌడ్‌, సయాలి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 17 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రతీక రావల్‌ (59 నాటౌట్‌), అర్ధశతకాలతో జట్టుకు ఘన విజయం అందించారు.

Comments

G
Loading comments...