Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ మాతాకీ జైతో మార్మోగిన నిర్మల్.. ఘనంగా తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
సందీప్ Aug 13, 2026 3:40 PM నిర్మల్ General
భారత్ మాతాకీ జైతో మార్మోగిన నిర్మల్.. ఘనంగా తిరంగా ర్యాలీ - Udayam
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశం, ధర్మం కోసం యువత తమ సమయాన్ని కేటాయించాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువకులు, దేశభక్తులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తిని చాటారు.

Comments

G
Loading comments...