Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెలియా తండాలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
మధుప్రియ Aug 13, 2026 9:57 PM నిజామాబాద్General
బెలియా తండాలో ఉచిత వైద్య శిబిరం - Udayam
ధర్పల్లి మండలం లోని బిలియా తండా గ్రామంలో గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుజి నాయక్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎఫ్‌ఏతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్థులకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...