వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీక్ కేసులో పుణెకు చెందిన బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే హస్తం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. మే 14న ఆమెను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.
ప్రశ్నపత్రం తయారీ ప్యానల్‌లో ఉన్న బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణిలతో కలిసి వాఘ్మారే కుట్ర పన్నినట్లు తేలింది. భారీగా డబ్బు ఆశజూపిన విద్యార్థులకు వీరు ప్రశ్నలను చేరవేసినట్లు సీబీఐ వెల్లడించింది.
Comments
Loading comments...

