Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 31, 2026 1:42 PM పెద్దపల్లి General
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు - Udayam
భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వర్ష పరిస్థితులను సమీక్షించారు. చెరువులు, గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. ముంపు ప్రాంత ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...