Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడిబయట పిల్లల నమోదు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి: జేసీ

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 7:54 PM విజయనగరంGeneral
బడిబయట పిల్లల నమోదు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి: జేసీ - Udayam
పాఠశాలల హేతుబద్ధీకరణ, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి పేర్కొన్నారు. మంగళవారం తన ఛాంబర్లో గిరిజన సంక్షేమ శాఖ డీడీ, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, ఉప విద్యా శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయుల సర్దుబాటు, మౌలిక వసతుల త్వరితగతిన పూర్తి చెయ్యాలని తెలిపారు.

Comments

G
Loading comments...