బడ్డీ కొట్లలో జోరుగా మద్యం

జిల్లాలోని చిరుదుకాణాలు, బడ్డీ కొట్లలో శీతల పానీయాలతో పాటు అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 8 తీర మండలాల్లోని 40 మత్స్యకార గ్రామాల్లో బెల్టు దుకాణాలు వెలిశాయి.
యానాం నుంచి గోదావరి మీదుగా అక్రమ మద్యం సరఫరా అవుతుండగా, పర్మిట్ రూంల పేరుతో అనధికారిక బార్లు నిర్వహిస్తుండటంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...
