వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు స్పందించి, పాఠశాలను మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి సవితకు హోం మంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పాఠశాల ద్వారా మత్స్యకార, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అనిత పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

