వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ఆర్జీయూకేటీ మెస్‌లో ఆదివారం వడ్డించిన అల్పాహారంలో బొద్దింక ప్రత్యక్షమైంది. పాత నిర్వాహకులకే కాంట్రాక్టులు అప్పగించడంతో ఆహార నాణ్యత పడిపోయిందని విద్యార్థులు మండిపడుతున్నారు. గతంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినా అధికారులు కమిటీల పేరుతో కాలయాపన చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జి ఉపకులపతి గోవర్ధన్ హామీ ఇచ్చారు. నాణ్యతను తనిఖీ చేస్తామన్న అధికారుల హామీలు నీటి మూటలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

