వార్తలకు తిరిగి వెళ్లండి
కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని 'చిత్రకూట్ కౌశల్య' పాఠశాలలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పాఠశాల భవనం అంతటా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

