Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలినేనికి జనసేనలో ప్రాధాన్యం తగ్గిందా..?

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 5:38 PM ప్రకాశం General
బాలినేనికి జనసేనలో ప్రాధాన్యం తగ్గిందా..? - Udayam
జనసేనలో మాజీ మంత్రి బాలినేని రాజకీయ ప్రాధాన్యంపై చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం కోసం ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. నాదెండ్ల మనోహర్‌, నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లతో విభేదాలు అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తంగా బాలినేని విషయంలో జనసేన వైఖరి మారినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...