Back to feed
కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ లాంచ్: ధర రూ.1.30 లక్షలు
Suhana Khan Jun 02, 2026 9:49 AM అల్ ఇండియా 19 views1 day ago

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో అప్‌డేటెడ్ అవెంజర్ స్ట్రీట్ 220 క్రూయిజర్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎబోనీ బ్లాక్, రెడ్ వైన్ రంగుల్లో లభించే ఈ బైక్ ధరను రూ.1.30 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించారు.
ఇందులో 220 సీసీ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్ట్రీట్ 160 మోడల్‌ను నిలిపివేసిన తరుణంలో సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ మోటార్ సైకిల్‌ను బజాజ్ అందుబాటులోకి తెచ్చింది.
Comments
Loading comments...



