వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశంలో సాంకేతిక విప్లవం, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

