Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

Follow Udayam on Google
సందీప్ Aug 13, 2026 12:35 PM నిర్మల్ General
బాసర గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - Udayam
బాసర గోదావరి నది త్రిబుల్‌ ఐటీ వాటర్‌ పంపు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు బాసర సీఐ దీపక్‌ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని టీషర్ట్‌, నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నుంచి బయటకు తీయించినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు మొబైల్‌ నంబర్‌ 8712659540కు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...