వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలోని వన్‌వే రహదారి వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ATM నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో మెషిన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

